మట్కా-బ్యాక్ టు సెట్స్

varun tej gives matka movie shooting update

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చాడు వరుణ్ తేజ్. దాదాపు 175 రోజుల తరువాత కొత్త ఎనర్జీతో సెట్స్ కు వచ్చాను.. మట్కాకు రెట్రో మ్యాజిక్ ను తీసుకురావడానికి రెడీ ఉన్నాము అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

View this post on Instagram

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.