అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తన పాత్రల ద్వారా ఎలాంటి పాత్ర అయినా చేయగలడు అనే పేరును సైతం తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు అలానే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు.. వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ ఏ అవకాశం వస్తే ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే మంత్ ఆఫ్ మధు అనే వెబ్ సిరీస్ తో దాదా సాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఉత్తమ నటుడిగా కూడా అవార్డును సొంతం చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. లోకేశ్ అజిల్స్ దర్శకత్వంలో లెవన్ అనే టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ను బట్టి వరుస హత్యలు చేస్తున్న హంతకుడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నట్టు అర్థమవుతుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే విషయాన్ని నవీన్ చంద్ర ఇన్వెస్టిగేషన్ చేయడం చూపించారు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో రెయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, రవి వర్మ, కిరీటి దామరాజు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























