టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఏక కాలంలో రెండు చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. వీటిలో ఒకటి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ కాగా, మరొకటి వెంకీ కుడుముల డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’. కాగా ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. ఇక నితిన్, వెంకీ కుడుముల ఇద్దరూ కలిసి ఇంతకుముందు ‘భీష్మ’ అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఈ క్రమంలో ఈసారి యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. రాబిన్‌హుడ్‌లో ఒక స్టార్ యాక్ట్రెస్ హీరోయిన్గా నటించనుందని మూవీ టీం ప్రకటించింది. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నితిన్ సరసన కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా శ్రీలీల ఇటీవలే రవితేజ 75వ చిత్రంలో కూడా హీరోయిన్గా ఖరారైన విషయం తెలిసిందే.
ఇక ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాను విజయవంతమైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం ఆయన అందించిన అద్భుతమైన స్కోర్ ఆకట్టుకుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























