రామోజీ రావు గారు మన మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్నా – మోహన్ బాబు

Mohan Babu Condolences To Ramoji Rao

మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామోజీ ఈ వేకువ జామున మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా రామోజీరావు మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు డా. మోహన్ బాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. “శ్రీ రామోజీ రావు గారు మహోన్నతమైన వ్యక్తి. పత్రికా రంగంలో రారాజు, అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని మన భారతదేశంలో నిర్మించారు. ఆయన విజన్, ఆలోచనా విధానం చాలా గొప్పది. ఆయనకు, నాకూ 42 సంవత్సరాల నుంచీ ఆత్మీయ సంబంధం. ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు, మంచి విషయాలు చెప్తారు. నేను ఆయన దగ్గరనుంచీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అటువంటి గొప్ప మహావ్యక్తి మన మధ్య లేరు అంటే నేను నమ్మలేకపోతున్నాను. మనసు చాలా ఆవేదనతో నిండిపోయింది. నా కుటుంబానికే కాదు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఇది మాటల్లో చెప్పలేం. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వమని భగవంతుని ప్రార్ధిస్తున్నాను” అని పేర్కొన్నారు మోహన్ బాబు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.