ఈ ఏడాది మరో దిగ్గజం దివికేగింది. మీడియో మొగల్, ఈటీవీ అధినేత, ప్రముఖ నిర్మాత రామోజీ రావు నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున మరణించారు. ఇక రామోజీ రావు మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేస్తున్నారు.దీంతో రాజకీయ, సినిమా, పారిశ్రామిక రంగాలు విషాదంలో మునిగిపోయాయి. రామోజీరావు మరణంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది.. ఓం శాంతి అంటూ సంతాపం తెలిపారు.
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
దివి కేగింది 🙏💔🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024
ఇంకా విక్టరీ వెంకటేష్.. రామోజీరావు నిజమైన దార్శనికుడిగా ఉన్నారు..భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు.
Ramoji Rao garu was a true visionary whose revolutionary work in Indian media has left an unforgettable legacy. His contributions to journalism and cinema have inspired so many. He will be missed dearly. Heartfelt condolences to his loved ones. May his soul rest in peace 🙏🏻 pic.twitter.com/YKEDaEHeCT
— Venkatesh Daggubati (@VenkyMama) June 8, 2024
అక్షర యోధుడు రామోజీ రావు మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారన్నారు. ప్రజాపక్షం వహిస్తూ.. జనచైతన్యాన్ని కలిగించారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.., ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు పవన్.
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రామోజీ రావు గారు – JanaSena Chief Shri @PawanKalyan #RamojiRao pic.twitter.com/SMgT991MBQ
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2024
జూనియర్ ఎన్టీఆర్ తమ ట్విట్టర్ ద్వారా.. శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm
— Jr NTR (@tarak9999) June 8, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































