ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా సినిమాకు డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈమధ్య తన నుండి వచ్చిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకత్వంలో నరేష్ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు నరేష్. మే 3 తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అనుకున్నంత విజయాన్ని అయితే ఈసినిమా అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ముందు చెప్పినట్టు మే 31 తరువాత ఓటీటీలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చాలా సైలెంట్ గా ఎలాంటి అప్ డేట్ లేకుండా అమెజాన్ ప్రైమ్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఈసినిమా. నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించగా.. గోపీ సుందర్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























