యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అయితే అందుకోలేకపోయింది. థియేటర్ల లో ఓ మోస్తరుగా ఆడినా మంచి కలెక్షన్లనే సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా మే 23న తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రానున్నట్టు తెలుస్తుంది. నిజానికి మే 24 నుంచి రత్నం సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఒక రోజు ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
కాగా ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించగా…సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాను జీ స్టూడియోస్ ఇంకా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























