తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమైంది.ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ మాస్ ఇంట్రో సాంగ్ తో పాటు ఫైట్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విత్ రవి చంద్రన్ ఈసినిమా ను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ను నిర్మిస్తుంది.తమిళ స్టార్ హీరో తో మైత్రి సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. ఈసినిమా పై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అజిత్ ప్రస్తుతం ఈసినిమా తోపాటు విడా ముయార్చి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాను మగిజ్ తిరుమనేని తెరకెక్కిస్తున్నాడు.అర్జున్ సర్జా ,త్రిష,ఆండ్రియా జెర్మియా, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇదిలావుంటే అజిత్ గత చిత్రాలు ఏవి బ్లాక్ బాస్టర్ అనిపించుకోలేకపోయాయి. ఈరెండు సినిమాలతో ఎలాగైనా హిట్లు కొట్టి ఫామ్ లోకి రావాలని అజిత్ చూస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























