గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్‌ రిలీజ్

Geetanjali Malli Vachindhi Trailer Released

తెలుగమ్మాయి అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ‘ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి’ అంటూ ప్రేక్షకులకు థ్రిల్ అందించడానికి వస్తోన్న ఈ మూవీ అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా కావడం విశేషం. ‘నిన్ను కోరి’, ‘నిశ్శ‌బ్దం’ చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన కొరియోగ్రాఫ‌ర్ శివ తుర్ల‌పాటి ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కామెడీ అండ్ హార్రర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, అలీ, సునీల్‌, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మరియు ప్రచారచిత్రాలు మంచి ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే.. మరోసారి ‘గీతాంజ‌లి’ చిత్రాన్ని గుర్తు చేసింది.

2014లో వచ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇక ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ను చూస్తే.. ఇందులో కూడా శ్రీనివాస్‌ రెడ్డి ద‌ర్శ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. హార్ర‌ర్ సినిమా తీద్దామని అంజ‌లి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబ‌డిన భ‌వంతిలోకి వెళతారు. అయితే ఆ భ‌వంతీలో షూటింగ్ జ‌రుగుతున్న సమయంలో వారికి కొన్ని అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురవుతుంటాయి. ఆ ఇంట్లో మూడు దెయ్యాలు ఉండటం వారు గమనిస్తారు. అయితే ఇవి నిజంగా ఉన్నాయా? లేదంటే వారి భ్రమేనా? వాటిని చూసిన తర్వాత అంజలి అండ్ టీమ్ ఏం చేసింది? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

ఇక ఇప్పటికే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను నైజాం ఏరియాలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో.. ప్రాజెక్టులోకి దిల్ రాజు ఎంటరవడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా మ‌ల‌యాళ చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ మాధ‌వ్‌ టాలీవుడ్‌కు ప‌రిచ‌యమవుతున్నారు. ఏప్రిల్ 11వ తేదీన తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.