మంజుమ్మల్ బాయ్స్ కు పెయిడ్ ప్రీమియర్స్ 

Manjummel Boys Premieres from April 5th

గత నెలలో మలయాళ ఇండస్ట్రీని ఊపేసిన సినిమా మంజుమ్మల్ బాయ్స్.సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా సింగిల్ లాంగ్వేజ్ లోనే  200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.థియేటర్లలో ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.అయితే ఒక్క కేరళ లోనే కాదు  తమిళనాడులో కూడా సెన్సేషన్ సృష్టించింది.అక్కడ 60కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతకుముందు వరకు అక్కడ కింగ్ ఆఫ్ కొత్త 6 కోట్లతో హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా ఉండేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మంజుమ్మల్ బాయ్స్  ఇప్పుడు అదే టైటిల్ తో తెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను రిలీజ్ చేస్తుంది.కంటెంట్ తెలుగు వాళ్లకు కూడా కనెక్ట్ అవుతుందన్న నమ్మకంతో రిలీజ్ కు ఒక్క రోజు  ముందుగానే ఏప్రిల్ 5న సెలెక్టడ్ థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు.ఈరోజు సాయంత్రం 6గంటలనుండి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

గత నెలలో ప్రేమలు అనే మలయాళ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమా 15కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి  అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ డబ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు మంజుమ్మల్ బాయ్స్ రిలీజ్ అవుతుంది.మరి ఈసినిమా ప్రేమలు రికార్డు ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.