ప్రేమలు ఓటీటీ రిలీజ్ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమాను తెలుగులో కూడా సూపర్ గా రిసీవ్ చేసుకున్నారు.దాదాపు 15కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ఈసినిమాను తెలుగులో విడుదలచేశాడు.ఈసినిమాతో మంచి ప్రాఫిట్స్ ను చూశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.ఈనెల 12న ఒరిజినల్ వెర్షన్ మలయాళంతోపాటు తమిళ ,హిందీ భాషల్లో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.హాట్ స్థార్ కూడా ఈ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది.అయితే తెలుగు వెర్షన్ మాత్రం అదే రోజున మరో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.ఆహా వీడియో ,ప్రేమలు తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుందట.దాంతో తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ లోకి రానుంది.
ఇక ఈసినిమా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 135కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆల్ టైం ఫోర్త్ మలయాళం గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం ,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ లీడ్ రోల్స్ లో నటించగా విష్ణు విజయ్ సంగీతం అందించాడు.ఈసినిమాను పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ తన ఫ్రెండ్స్ తోకలిసి నిర్మించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: