యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే అక్కడ ఎన్టీఆర్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా గోవా షెడ్యూల్ లో జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. ఈవిషయాన్ని తన ఇన్ట్సా ద్వారా తెలియచేసింది జాన్వీ కపూర్. కొన్ని రోజుల పాటు అక్కడే జరుగనున్న ఈసినిమా షూటింగ్ లో తారక్, జాన్వీకపూర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: