గత వారం అన్ని చిన్న సినిమాలే విడుదలకాగా ఇందులో ఏఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చేయలేకపోయింది.ఇక ఈవారం ఓ మీడియం బడ్జెట్ మూవీ విడుదలవుతుంది అదే ఆపరేషన్ వాలంటైన్.ఈసినిమాకు హైప్ కూడా బాగానే వుంది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈసినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.
ఇక ఈసినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులకు స్పెషల్ షో వేశారు.ఆషో చూసిన వారు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.స్టోరీతో పాటు విజువల్స్ అదిరిపోయాయంట.చాలా సీన్లు గూస్ బాంబ్స్ తెప్పించేలా వున్నాయట.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని వరుణ్ తేజ్ యాక్టింగ్ సూపర్ అంటున్నారు.ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కడా మిస్ అవ్వలేదట.ముఖ్యంగా పుల్వామా ఘటన తాలూకు విజువల్స్ కంటతడి పెట్టించాయట.దేశభక్తికి వున్న వారి విపరీతంగా నచ్చుతుందని అంటున్నారు.ఇంటర్వెల్,ప్రీ క్లైమ్యాక్స్ , క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయట.ప్రతి భారతీయుడు చూడదగ్గ సినిమా అంటూ రివ్యూస్ వస్తున్నాయి.
Sujalam suphalaam Malayaja seethalam Sasyasyaamalam Maataram🇮🇳
VANDE MATARAM 🫡#OperationValentine has Goosebumps moments throughout the film. A perfect aerial combat movie with the right emotions in the right place.❤️🔥Terrific BGM and Top-notch VFX considering the budget.… pic.twitter.com/nE5bDyNUN7
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 28, 2024
సో ఈసినిమాతో వరుణ్ తేజ్ ఎదురుచూపులకు బ్రేక్ పడనుంది.ఇంతకుముందు వరుణ్ చేసిన ప్రయోగాత్మక సినిమాలు అంతగా వర్క్ అవుట్ కాలేదు కానీ ఈసారి మాత్రం ఆపరేషన్ సక్సెస్ అయ్యేలానే వుంది.మరి ఇది ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మానుషీ చిల్లర్,రుహాణి శర్మ,నవదీప్ కీలక పాత్రల్లో నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.సోనీ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.ఈసినిమా తెలుగుతోపాటు హిందీలోనూ విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























