సినిమాలకు ఇది సరైన సీజన్ కాకపోవడంతో మిగితా ఇండస్ట్రీ లు కొంచెం డల్ అవ్వగా మాలీవుడ్ బాక్సాఫీస్ మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ తో కళకళలాడిపోతుంది.రీసెంట్ గా రిలీజైనా మూడు మలయాళీ సినిమాలు అక్కడ భారీ వసూళ్లను కురిపిస్తున్నాయి.ఈమూడు కలిపి నిన్నటి వరకు 150కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి.ఇంతకీ ఈమూడు సినిమాలు ఏంటంటే..ప్రేమలు ,భ్రమయుగం ,మంజుమెల్ బాయ్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటిలో ప్రేమలు ఎక్స్ట్రార్డినరీ రన్ ను కనబరుస్తుంది.హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో వుంది.ఈసినిమా నిన్నటివరకు ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.కేరళలో అయితే 35కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తుంది.త్వరలోనే ఈసినిమా తెలుగులో కూడా విడుదలకానుంది.
ఇక ఈసినిమా తరువాత స్టార్ హీరో మమ్ముట్టి నటించిన భ్రమయుగం కూడా అదరగొడుతుంది.నిన్నటి వరకు ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇది గతవారం ఇదే టైటిల్ తో తెలుగులోనూ విడుదలైయింది.వీటితో పాటు మంజిమల్ బాయ్స్ అనే సినిమా కూడా సూపర్ వసూళ్లను రాబట్టుకుంది.చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా నిన్నటి వరకు 26కోట్ల వరకు రాబట్టింది.అలా మొత్తానికి డల్ సీజన్ గోల్డెన్ సీజన్ గా టర్న్ అయ్యింది మాలీవుడ్ కి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























