పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ, మణిశర్మ సంగీతం చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. మార్చి 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ లో మార్పు వచ్చింది. ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























