సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం గత వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైయింది.తెలుగు తోపాటు హిందీ,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తుండగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగు వెర్షన్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా హిందీ వెర్షన్ మూడో స్థానం లో తమిళ వెర్షన్ ఐదో స్థానంలో కొనసాగుతుంది.దాంతో థియేటర్లలోనే కాదు ఓటిటి లోకూడా ఈసినిమాకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే సంక్రాంతికి రీజినల్ మూవీ గా విడుదలైన ఈసినిమా 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.రివ్యూస్ అంత అనుకూలంగా రాకపోయినా మహేష్ కు వున్న క్రేజ్ తో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈసినిమాలో శ్రీలీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా రమ్య కృష్ణ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు.తమన్ ఈసినిమాకు సంగీతం అందించగా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించింది.
ఇక ఈసినిమా తరువాత తన 29వ సినిమాను టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు మహేష్ బాబు.అయితే ఈసినిమా గురించి ఇంతవరకు అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు.ఈసినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: