ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Operation Valentine Movie new Release Date fixed

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. గత ఏడాది గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు టీజర్ కూాడా రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్సే సొంతం చేసుకున్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. గత ఏడాదే ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా వేశారు. ఆ తరువాత ఫిబ్రవరి 16వ తేదీన కూడా సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాం అంటూ ఇటీవలే చిత్రయూనిట్ తెలిపింది. ఇక ఇప్పుడు ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మార్చి 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.