మాస్ మహారాజా రవితేజ నుండి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పలు సినిమాలు బరిలో ఉండటంతో పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసినిమా. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆడుమచ్చా సాంగ్, గల్లంతే, ఈగల్ ఆన్ ద వే అంటూ పలు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పుడు నాలుగో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే నాలుగో పాటు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈ నాలుగో పాటను రేపు అంటే ఫిబ్రవరి 4వ తేదీన సాయంత్రం 8గంటల 1 నిమిషానికి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
The 4th single from #EAGLE ♾ #Sahadev is all set make it’s way into your playlists! 💥💥#Garudam Full Song Out Tomorrow at 8:01 PM 🔥
Worldwide Grand Release in Telugu & Hindi on FEB 9th! 🔥🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla… pic.twitter.com/JGfApdGTfM
— People Media Factory (@peoplemediafcy) February 3, 2024
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























