NBK109.. కన్ఫామ్ ఫీమేల్ లీడ్ గా ఊర్వశి రౌతేలా

Urvashi Rautela Important Role in NBK 109

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కాకముందే ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బాబి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో బాబి డియోల్ నటిస్తున్నట్టు ముందు నుండీ వార్తలు రాగా ఆ వార్తలను కన్ఫామ్ చేస్తూ ఆయన పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్నిఆమె కూడా కన్ఫామ్ చేస్తూ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. తన ఇన్ట్సా ద్వారా NBK109 లో ఫీమేల్ లీడ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.