గత కొన్నేళ్లుగా మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లాంటి క్లిష్ట పరిస్థితిల్లో కూడా మన తెలుగు సినిమాలు దేశంలోనే ఎక్కువ మార్కెట్ ను క్రియేట్ చేసి సంచలనం సృష్టించాయి. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఆసినిమా మరేదో కాదు హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది. తెలుగులో ఈసినిమా ఎప్పుడో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక హిందీలో ఈసినిమా 50 కోట్ల క్లబ్ లో చేరి అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. మరోవైపు యూఎస్ఏలో కూడా ఈసినిమా మొదటినుండీ కలెక్షన్స్ లో ఎక్కడా రాజీపడకుండా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూనే ఉంది. ఈసినిమా ఇప్పటివరకూ అక్కడ 33కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకొని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఓవర్సీస్‌లో టాప్ 5 ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలో టాప్‌లో నిలిచింది.
The boundless love & support from the audience took #HANUMAN into the elite Box office list in the overseas market💥
HanuMan is now the TOP-5 All Time Highest Grossing Telugu Film in the USA 🇺🇸 🔥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123Overseas Release by @Primeshowtweets &… pic.twitter.com/MDqkERrOhJ
— Primeshow Entertainment (@Primeshowtweets) January 21, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























