సాక్షాత్తూ ఆ చిరంజీవే.. ఈ చిరంజీవికి అవకాశం కల్పించాడు – మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

Megastar Chiranjeevi Emotional Post on Consecration of Ram Lalla at Ayodhya

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం మరియు శ్రీరాముడి నూతన విగ్రహావిష్కరణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు (జనవరి 22, 2024) సందడి నెలకొంది. నభూతో.. అన్నట్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్.. అయోధ్య రామ మందిర వేడుకలో పాల్గొంటున్నారు. ఇందుకోసం వారు నిన్ననే అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో..”ఈ దినం చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఇది నిజంగా అపరిమితమైన అనుభూతి. అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం సందర్భంగా ఈ ఆహ్వానాన్ని  దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం. కోట్లాది భారతీయుల కలలను నెరవేర్చిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ మహత్కార్యంలో ముఖ్య భూమిక పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ దాస్ జీకి హృదయపూర్వక అభినందనలు” తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు..”ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది. నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు! జై శ్రీ రామ్” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.