మీడియం బడ్జెట్ మూవీ గా వచ్చి హనుమాన్ బీభత్సం సృష్టిస్తుంది.స్టార్ హీరోల పేరిట వున్న రికార్డులను చెరిపేస్తూ హావ కొనసాగిస్తుంది.నిన్న 10వరోజు ఈసినిమా తిరుగులేని కలెక్షన్స్ ను రాబట్టుకొని పలు రికార్డులు సృష్టించింది.తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం 7.90కోట్ల షేర్ ను రాబట్టి నాన్ ఎస్ఎస్ఆర్ ఆల్ టైం రికార్డు క్రీయేట్ చేసింది.10వ రోజు ఇంతకుముందుఆర్ఆర్ఆర్ 16కోట్ల షేర్ ను అలాగే బాహుబలి 2.. 8కోట్ల షేర్ తో తొలి రెండు స్థానాల్లో వున్నాయి.తాజాగా హనుమాన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్నటి తో హనుమాన్ 100కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసి మరో రికార్డు సృష్టించింది.మీడియం రేంజ్ సినిమాలో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమా ఇదే.అంతేకాదు ఈసినిమాతో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హనుమాన్ హీరో తేజ సజ్జా.టాలీవుడ్ నుండి ఈజాబితాలో ప్రభాస్ ,రామ్ చరణ్ ,మహేష్ బాబు, ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ ,చిరంజీవి ఉండగా తాజాగా తేజ కూడా జాయిన్ అయ్యాడు.
అటు ఓవర్సీస్ విషయానికి వస్తే నిన్నటి వరకు 5మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. నార్త్ అమెరికాలో అయితే నిన్నటి తో 4మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన 5వ తెలుగు సినిమాగా రికార్డును ఖాతాలో వేసింది.మరి హనుమాన్ ఫుల్ రన్ లో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























