మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి సినీ పరిజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలుస్తుంది. ఎలాంటి సినిమా నేపథ్యంలేని కుటుంబం నుండి వచ్చి.. ఎంతో కష్టపడి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ మొదట్లో ఏ పాత్ర వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళ్లాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ మెగాస్టార్ అనే స్థాయికి ఎదిగారు. అప్పటి వరకూ చిరులాగ డ్యాన్స్ చేసేవాళ్లు లేకపోవడంతో ఆయన డ్యాన్స్ కు, స్టైల్ కు అప్పట్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఇప్పటికి కూడా అదే క్రేజ్ ఉందనుకోండి. ఇక ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో రికార్డులు పగలకొట్టారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు.. ఎంతో పేరును సొంతం చేసుకున్నారు. స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చారు కాబట్టే సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో మందికి స్పూర్తిదాయకమయ్యారు చిరు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో చాలా మంది చిరు పేరునే చెబుతారంటే అతిశయోక్తి కాదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి అలాంటి చిరంజీవి బయోపిక్ తీయాలంటే అది కత్తిమీద సాము లాంటిది. ఆ ధైర్యం కూడా ఎవరూ చేయరేమో. అయితే తన బయోగ్రఫి రాసే బాధ్యతను మాత్రం ఓ వ్యక్తి అప్పగించారు చిరంజీవి. ఆవ్యక్తి ఎవరో కాదు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్. తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన చిరంజీవి అక్కడకు విచ్చేసిన యండమూరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా ఉన్నారంటే అది యండమూరి గారే.. అలాంటి గొప్ప కలం బలం మేథస్సు ఉన్నటువంటి యండమూరి గారు నా ఆటోబయోగ్రఫి రాస్తాను అని అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.. ఆయన రాసిన అభిలాష సినిమాతోనే నాకు సుస్థిర స్థానం ఏర్పడంది.. నా బయోగ్రఫీ రాసే బాధ్యతను మీకే అప్పగిస్తున్నా అంటూ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























