గుంటూరు కారం కలెక్షన్స్‌పై.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Producer Naga Vamsi Interesting Comments on Guntur Kaaram Collections

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ యేడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘గురూజీ’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఫిమేల్ లీడ్ రోల్‌లో శ్రీలీల, మరో కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇక రిలీజ్‍ ముందే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా.. అందుకు తగ్గట్లే జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తొలిరోజు నుంచి ఈ సినిమాపై అనూహ్యంగా కొంత నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ దీనిపై స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “గుంటూరు కారం సినిమా మీద కొంతమంది కావాలని పనిగట్టుకుని నెగటివ్ ప్రచారం చేశారు. దురుద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో కూడా ఇదే తరహా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆ ప్రభావం సినిమాపై పడింది. ఫస్ట్ డే ప్రేక్షకులు కొంచెం గందరగోళానికి గురయ్యారు. కానీ ఆ తరువాత ఫ్యామిలీ ఆడియెన్స్ చూసి, సినిమా బాగుంది అని చెప్పడంతో సినిమా నిలబడింది. రెండో రోజు నుండి కలెక్షన్స్ అదిరిపోయాయి” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “అయితే మేము ప్రేక్షకుడిని ఈ సినిమాకి తగిన విధంగా తయారు చెయ్యలేకపోయాం. ఈ సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై మేము విడుదలకు ముందే ఇంకా బాగా ప్రచారం చేసి ఉంటే బాగుండేది. ఇక రివ్యూస్ వలన సినిమా మీద ఎటువంటి ప్రభావం లేదు. ప్రేక్షకులకి సినిమా నచ్చి విజయవంతం చేశారు. ఇంత జరుగుతున్నా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. ఎందుకంటే, ఈ సినిమాను ఆయన పూర్తిగా నమ్మి చేశారు. చివరకు ఆయన నమ్మకమే నిజమైంది. మా సినిమా పెద్ద విజయం సాధించి, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది” అని పేర్కొన్నారు నాగవంశీ.

ఆన్‌లైన్‌ లో మూవీస్‌ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.