ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారెేజ్ సినిమా తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఈసినిమా నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఇక గ్లింప్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ లకు సంబంధించి అప్ డేట్ లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో కొద్ది రోజుల బ్రేక్ తరువాత ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఓ మాసివ్ షెడ్యూల్ ను నేడు హైద్రాబాద్ లో మొదలుపెట్టినట్టు సమాచరం. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టగా.. రెండు వారల పాటు ఈ షూటింగ్ ఉండనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: