అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఆశిష్3 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు ఆశిష్. ఈసినిమా షూటింగ్ పూర్తయిందని.. అరుణ్ గారు నామీద నమ్మకం ఉంచి నేను ఈ రోల్ చేయగలనని నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్.. మరోసారి మీతో పనిచేసే అవకాశం వస్తుందని కోరుకుంటున్నాను.. ఇంకా కీరవాణి సార్, పీసీ శ్రీరామ్ లాంటి లెజెండ్స్ తో కలిసి పనిచేయడం గొప్ప ఆపర్చునిటీ.. వైష్ణవి చైతన్య నీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మంచి ఎక్స్ పీరియన్స్ లాంటిది.. ఫైనల్ గా లవ్లీ ప్రొడ్యూసర్స్ మీరు లేకుండా ఇది సాధ్యం కాదు అంటూ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























