ప్రస్తుతం ఎక్కడ చూసినా గుంటూరు కారం సందడే కనిపిస్తుంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అతడు, ఖలేజా వంటి క్రేజీ సినిమాల తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా సంక్రాంతికి సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని.. ఆదిశగానే చిత్రయూనిట్ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేశారు. వీటిలో ధమ్ మసాలా, ఖుర్చీ మడతపెట్టి పాటలకు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఎనర్జిటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఈవెంట్ లోనే మావా ఎంతైనా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ గా ఉన్నఈసాంగ్ ఆకట్టుకుంటుంది. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈపాటను శ్రీకృష్ణ, రామాచారి కలిసి ఆలపించారు. ఇందులో మహేశ్ బాబు స్టెప్స్ అదిరిపోయాయి. అలాగే, విజువల్స్, లిరిక్స్, కంపోజింగ్ కూడా అద్భుతంగా కుదిరింది.
#MawaaEnthaina is Here to Rule Ur PlayList 🤌🏽🔥
Let’s hummmmmmm it 🤩🌶️#RaappppaRapppapahhhg
Feel the energy of our dear #SuperStar 🔥
VOLUME UP 🎧🫶https://t.co/l6W3uRpF8b pic.twitter.com/d7AkKcYVLN
— thaman S (@MusicThaman) January 10, 2024
ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























