అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తరువాత పలు సినిమాలు చేసినా సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు సినిమాగా రీమేక్ చేసి ఆ సినిమాతో కాస్త హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఛత్రపతి రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా ఒక పవర్ ఫుల్ మూవీ తెరకెక్కనుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే తాజాగా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. టైసన్ నాయుడు అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. గ్లింప్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటుంది.
He has arrived with mighty power and mighty responsibility 💥💥
Deputy Superintendent of Police #TysonNaidu takes charge 🔥
Massive First Glimpse out now!
– https://t.co/n6Ojw5vWsrHappy Birthday @BSaiSreenivas ❤️🔥#HBDSaiSreenivas@saagar_chandrak @RaamAchanta #GopiAchanta… pic.twitter.com/wCmikmTKQT
— 14 Reels Plus (@14ReelsPlus) January 3, 2024
కాగా ఈసినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























