ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను చూసిన సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా హిట్ కొట్టినందుకు గాను ప్రభాస్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ టీమ్ ను అభినందించారు. ప్రభాస్ కు మాసివ్ బ్లాస్ట్ లాంటి సినిమాని అందించినందుకు థ్యాంక్స్ ప్రశాంత్.. ప్రభాస్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ అనుకున్నారు అలా ఉన్నందుకు స్క్రీన్ పై ప్రభాస్ ను చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా సలార్ లో భాగమైన అందరికీ కూడా బిగ్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. ఈ తుఫాన్ అప్పుడే ఆగదు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
My Heartfelt Thanks to Dear #PrashanthNeel for Bringing Out this Massive Magnum Opus.Happy to See Every One is Enjoying My #Prabhas On Screen & His Fans What Exactly Wanted.
A Big Congratulations to Each & Everyone Who is Part of #Salaar & this Hurricane Won’t Stop…
— Gopichand (@YoursGopichand) December 23, 2023
కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























