సలార్ లో పాత్రల మధ్య భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి

prabhas sharing interesting facts about salaar movie

త్వరలో రిలీజ్ కాబోతున్న ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలార్ చిత్రంలో పాత్రల మధ్య చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో నన్ను చూస్తారు. నేను, ప్రశాంత్ నీల్ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అందరినీ ఆకట్టుకుంటుందనే విషయాలపై కలిసి బాగా చర్చించాం. నా మైండ్‌లో ఉన్న ఆలోచనలను ఆయన ముందు పెట్టాను. దానికి ఏం చేయాలనే విషయాన్ని ఆయన నాకు వివరించారు. మేం అనుకున్న కథకు బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలనే విషయాన్ని చర్చించాం. నేను చెప్పిన ఆలోచనల్లో కొన్ని ప్రశాంత్‌కి నచ్చాయి. ప్రతి సెషన్ ముందు ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం. తను నా పాత్రను ఎలా చూపించాలనుకుంటున్నారనే విషయాలను తను నాకు వివరించేవాడు. ఇద్దరం కలిసి వర్క షాప్స్ చేశాం. సరదాగా సినిమాను పూర్తి చేశాం.

నేను సినీ జర్నీని ప్రారంభించి 21 ఏళ్లు అవుతున్నాయి. తనతో ఎప్పుడు షూటింగ్ చేస్తానా అని ఆసక్తిగా ఎదురు చూశాను. షూటింగ్‌కి వెళ్లాలనే ఆలోచనతో కాకుండా ప్రశాంత్‌తో సమయాన్ని గడపాలని అనుకున్నాను. నా 21 ఏళ్ల కెరీర్‌లో ఇలా ఎప్పుడూ భావించలేదు. సినిమా షూటింగ్ ప్రారంభమైన నెల రోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం.

ప్రశాంత్ హీరోలను గొప్పగా చూపించాలనుకునే దర్శకుడు. సినిమా షూటింగ్ సమయాన్ని తను రిలాక్స్‌డ్‌గా నా సమయానికి తగ్గట్లు చేసుకుంటూ వచ్చాడు. ఇక నాతో పాటు శ్రుతీ హాసన్, పృథ్వీరాజ్ ఇలా అందరం సెట్స్ లో కలిశామంటే చాలా సరదాగా గడిచిపోయేది. మా ఎంజాయ్‌మెంట్‌కి అడ్డే ఉండేది కాదు. నేను ఎప్పుడూ షాట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. ప్రశాంత్ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మేం వెయిట్ చేస్తామని చెప్పినా అతను వినలేదు. ముందుగానే అన్నీ ఏర్పాట్లను చేసుకునేవాడు. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎప్పుడు సెట్స్ లోకి అడుగు పెట్టానో సమయం గుర్తు లేదు. అయితే నేను ఎంటర్ అవగానే అంతా ఆపేసి హీరో సన్నివేశాలను చిత్రీకరించటానికి టీమ్ సిద్ధమైంది. తను అంతలా నన్ను కేరింగ్ గా చూసుకున్నారు.

సలార్ సినిమాలో నా పాత్ర కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు. క్యారెక్టర్ డిమాండ్ మేరకు కండలు పెంచాలని ప్రశాంత్ ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే నేను మారాను. అది నాకు సాధారణమైన విషయం మాత్రమే. గత 21 ఏళ్లలో నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం జరిగిన మార్పులు చాలా సాధారణమైన విషయమే’’ అని అన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సలార్ సీజ్ ఫైర్లో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కటి సోదర భావాన్ని ప్రేక్షకులు చూస్తారని తెలిపాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.