సలార్ నైజాం ఫస్ట్ టికెట్ కొన్న జక్కన్న

SS Rajamouli buys the first ticket of Salaar in Nizam

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ ను కూడా జోడించి ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా నైజాం మొదటి టికెట్ ను రాజమౌళి సొంతం చేసుకున్నాడు. 22వ తేదీన, సంధ్య 70 ఎంఎం ఉదయం 7 గంటల షో టికెట్ ను కొనుగోలు చేశారు. చిత్రయూనిట్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత ఈ టికెట్ ను రాజమౌళికి అందచేశారు.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 18 =