త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఫ్యాన్స్ మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైపోయింది. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఎట్టిపరిస్థితిల్లోనూ ఈసినిమాను చెప్పిన టైమ్ కే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆదిశగానే ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ధమ్ మసాలా అంటూ మొదటి పాటను రిలీజ్ చేయగా అత్యధిక వ్యూస్ ను రాబట్టుకొని సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఓ మై బేబీ అంటూ వచ్చే ఈపాట ప్రోమో ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. శ్రీలీల ఇంకా మహేష్ మధ్య వచ్చిన ఈపాట మెలోడియస్ గా ఉండి ఆకట్టకుంటుంది.
Here’s soulful melody, #GunturKaaram second single 🎵❤️
#OhMyBaby lyric video out now! 💞
– https://t.co/bHR2d44j9MA @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 @shilparao11SUPER 🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft…
— Haarika & Hassine Creations (@haarikahassine) December 13, 2023
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























