బిగ్ బాస్ సీజన్ 7.. సీజన్ మరో నాలుగో రోజుల్లో పూర్తయిపోతుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, ప్రియాంక ఫైనలిస్ట్ లుగా నిలిచారు. ఇక ఈ వారం ఎలాంటి గేమ్స్ ఉండవన్న సంగతి తెలిసిందే కదా. హౌస్ లో ఉన్న ఫైనలిస్ట్ లో జర్నీ వీడియోలను వేస్తున్నాడు బిగ్ బాస్. దీనిలో భాగంగానే సోమవారం అర్జున్, అమర్ జర్నీల వీడియోలను చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నిన్న ఎపిసోడ్ శివాజీ జర్నీతో స్టార్ట్ చేశారు. దాదాపు 17 నిమిషాల నిడివితో ఉన్న శివాజీ జర్నీ వీడియో చాలా బాగుంది. ఇక శివాజీని తన మాటలతో ప్రశంసించగా బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ కు హ్యాపీ ఫీలయ్యాడు శివాజీ. అంతేకాదు 25 ఏళ్ల సినీ కెరీర్ ఒక ఎత్తు అయితే.. బిగ్ బాస్ జర్నీఒక ఎత్తు.. కప్పు గెలవడం.. గెలవకపోవడం అనేది పక్కన పెడితే ఇక్కడ నుండి చాలా విషయాలు నేర్చుకొని వెళ్తాం అంటూ తెలిపాడు.
ఆ తరువాత ప్రియాంక జర్నీ వీడియోన వేసి చూపిస్తాడు. ఇక ప్రియాంకను కూడా పొగుడుతూ సింపుల్ గా ఉన్న ప్రియాంక.. శివంగి ప్రియాంకగా మారారు.. పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల.. 100 శాతం ఇస్తూ వచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో ఉంచుతుంది అంటూ ప్రశంసించాడు. ఇక తన వీడియోను చూస్తూ ఎమోషనల్ అయిపోయింది ప్రియాంక.
అనంతరం మరో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. నామినేషన్స్ లో గొడవ వల్ల అర్జున్, యావర్ గత కొద్దిరోజులుగా మాట్లాడుకోవట్లేదన్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో నిన్న ఎపిసోడ్ లో ఇద్దరూ కలిసిపోయారు. తన జర్నీ వీడియోలో యావర్ తో వచ్చిన సీన్లు బాగున్నాయని చెబుతూ వెనుక నుండి హగ్ చేసుకుంటాడు అర్జున్. దాంతో యావర్ అర్జున్ ను హగ్ చేసుకొని ఏడ్చేస్తాడు. దీంతో మంగళవారం ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: