జైలర్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు తలైవా పుట్టినరోజు కావడంతో ఆయన సినిమాల నుండి అప్ డేట్లు వచ్చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తలైవా 170 మూవీ నుండి కూడా అప్డేట్ వచ్చేసింది. ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే కదా. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వెట్టైయాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు.
The wait is over! ⌛ Presenting the title of #Thalaivar170 🕴🏻 – VETTAIYAN 🕶️
Unleashing Thalaivar’s power, style & swag on his special day! 💥#Vettaiyan 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/6wD1c5Zehw
— Lyca Productions (@LycaProductions) December 12, 2023
కాగా మంజు వారియర్, రితికా సింగ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ ఇంకా రానా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























