సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పై సీక్వెల్స్ లో గూఢచారి సీక్వెల్ ఒకటి. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా గూఢచారి. 2018 లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడే ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలిపినా అధికారిక ప్రకటన రావడానికి చాలా టైమే పట్టింది. ఈ ఏడాది జనవరిలో ఈసినిమా అధికారిక ప్రకటన ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇటీవలే అడివి శేష్ షూటింగ్ కు ప్రిపరేషన్ జరుగుతుంది.పెద్ద ప్రాజెక్ట్.. పెద్ద సినిమా.. ఒక పెద్ద స్పై ఫిలింను చేస్తున్నప్పుడు..అంతే ఎఫర్ట్స్ అవసరం.. సో టైమ్ తీసుకుంటుంది అంటూ తెలిపాడు. ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది.
Lights, camera, espionage 🎥
Our Agent 116 embarks on a new mission at #Trinetra 🔥
India’s most awaited spy sequel, #G2 – shoot begins today 🎬#Goodachari2@AdiviSesh #BanitaSandhu @vinaykumar7121 @peoplemediafcy @AKentsOfficial @vishwaprasadtg @vivekkuchibotla @abburiravi… pic.twitter.com/qSbqv9rKDx
— Telugu FilmNagar (@telugufilmnagar) December 11, 2023
కాగా ఈసినిమాలో బనితా సంధు హీరోయిన్ గా నటిస్తుంది. మేజర్ ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































