సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ను బట్టి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు చివరిదశకు వచ్చేసింది షూటింగ్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ధమ్ మసాలా అంటూ వచ్చిన ఈపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సకెండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు. సూపర్ రొమాంటిక్ కాఫీని ఈ సోమవారం ఆస్వాదిద్దాం అంటూ నాగవంశీ ట్వీట్ ని చేయగా..దానికి థమన్ దానికి నేను షుగర్ క్యూబ్ కూడా యాడ్ చేస్తాను, స్వీట్ స్పైస్ అంటూ పోస్ట్ చేసారు. ఇక వీరి ట్వీట్ కు శ్రీలీల రిప్లై ఇస్తూ వావ్ కాఫీ అండ్ షుగర్ క్యూబ్.. అది నాది అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈపాటకోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Wawwwwwuuuuuu
Coffee & Sugar cube
Coming together 🫶🌶️ @musicthaman 💬😋#SweetSpice#GunturkaaramSecondSingleAnd it’s Mine 😋 https://t.co/sTXE7XHlcq
— sreeleela (@sreeleela14) December 7, 2023
ఈసినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా.. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























