బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఇందులో రణ్‌బీర్ యాక్టింగ్, సందీప్ టేకింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో తొలి ఐదు రోజుల్లోనే రూ.482 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే.. ‘యానిమల్’ ఏ రేంజ్ హిట్టో అర్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన బాబీ డియోల్.. చేసింది చిన్న రోల్ అయినా, ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. దాదాపు 3 దశాబ్దాల ఆయన కెరీర్ లో ఈ పాత్రకు వచ్చినంత గుర్తింపు మరే సినిమాలోని క్యారక్టర్ కు రాలేదంటేనే తెలుస్తోంది.. బాబీ డియోల్ నటన ప్రేక్షకులను ఎంతగా అలరించిందో. ముఖ్యంగా ఈ సినిమాలో అబ్రార్ (బాబీ డియోల్) ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. తాజాగా జమల్ జమాలో అంటూ సాగే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో మారుమోగుతోంది.
Let the celebrations begin. Abrar’s Entry JAMAL KUDU song out now 🥳❤️
Dance away: https://t.co/7YgRE9402k#AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm@AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/3iCIYJN810— Animal The Film (@AnimalTheFilm) December 6, 2023
బుధవారం ఈ పాటను అఫీషియల్‌గా విడుదల చేయగా.. రిలీజైన 15 గంటల్లోనే 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. తద్వారా యూట్యూబ్‌లో ట్రెండింగ్స్ సాంగ్స్ లిస్ట్‌లో టాప్ 2 ప్లేస్‌లో జమల్ జమాలో నిలిచింది. అయితే ఇంత సెన్సేషన్ సృష్టిస్తోన్న ఈ పాట నిజానికి ఇండియన్ సాంగ్ కాదు, ఒక ఇరాన్ సాంగ్. ‘యానిమల్’తో ఇండియన్స్ మ్యూజిక్ లవర్స్‌కు ఈ పాట చేరువైంది. కాగా ప్రముఖ ఇరానియన్ కవి బిజాన్ సమాందర్ రాసిన ఈ పాట 1958లో వెలుగులోకి వచ్చింది.
నాటినుంచి ఇరాన్‌లో పెళ్లి వేడుకలతో పాటు ఇతర పంక్షన్స్‌లో తప్పకుండా ఈ పాట ప్లే చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1977లో ఈ పాటను అనౌశిర్వాన్ రోహాని అనే మ్యూజిక్ డైరెక్టర్ రీమిక్స్ చేశాడు. యానిమల్ సినిమాలో సందీప్ వంగా ఈ రీమిక్స్ పాటనే వాడుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్.. మేఘన నాయుడు, ఐశ్వర్యదాసరి, అభిక్య, సబీహ తో పాటు కలిసి మరికొంత మంది చిన్నారులతో కలిసి మళ్లీ పాడించాడు. ఫోక్, ట్రెడిషనల్ కలబోతగా సాగే ఈ సాంగ్ బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడాలు లేకుండా అన్ని భాషల ఆడియెన్స్ ని ఫిదా చేస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























