బిగ్ బాస్7..చూస్తుండగానే హౌస్ లో 12 వారాలు పూర్తయి పోయాయి. గత వారం గౌతమ్ ఇంటినుండి ఎలిమినేట్ అయిపోయాడు. ప్రస్తుతం అయితే హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ మొదలైపోయింది. ఇక సోమవారం అంటే అందరూ వెయిట్ చేసేది నామినేషన్ ప్రక్రియ కోసం. ఈ సీజన్ కు ఇదే లాస్ట్ నామినేషన్ ప్రోసెస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నామినేషన్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ ఇద్దరినీ నామినేట్ చేయాలి. ఈనేపథ్యంలో ముందుగా యావర్ వచ్చి ప్రియాంకను అలానే శోభాను నామినేట్ చేస్తాడు. వీకెండ్ ఎపిసోడ్ లో ప్రియాంక ఓడిపోతే తీసుకోలేకపోతున్నావని.. పనులు తక్కువగా చేస్తున్నావని చెప్పింది. ఇక ఇదే కారణాన్ని చెబుతూ.. నేను తీసుకోలేకపోతున్నాను అన్నావు మరి అమర్ తీసుకుంటున్నాడా అంటూ.. పనులు తక్కువ చేస్తున్నా అన్నావు.. శోభా కంటే తక్కువ చేస్తున్నానా.. నువ్వు ఫేవరిటిజం చూపిస్తున్నావు అంటూ శోభకు రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తరువాత శోభా యావర్,శివాజీని నామినేట్ చేసింది. అనంతరం ప్రశాంత్ అమర్ ను శోభా శెట్టిని.. అర్జున్ అమర్, యావర్ ను.. ప్రియాంక అమర్, యావర్ ను.. శివాజీ ప్రియాంక, అమర్ ను.. అమర్ ప్రశాంత్, యావర్ ను నామినేట్ చేశారు.
ఇక నామినేషన్ ప్రాసెస్ పూర్తయిన తరువాత ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. రెండు వారాల ముందు నుండే ఓటింగ్ లైన్స్ ను తెరవనున్నట్టు తెలిపాడు. ఈవారం నుండే ఓటింగ్ ను తీసుకుంటామని.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు విజేతగా నిలుస్తారని తెలిపారు. అర్జున్ కు ఫినాలే టికెట్ ఉండటంతో ఈవారం నామినేషన్ లో ఉండడని తెలిపారు. దీంతో సోమవారం ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























