కన్నప్ప కోసం.. ‘పెదరాయుడు’ లెజెండ్స్ కలిసిన వేళ

Kannappa Mohan Babu and Sarath Kumar Adding Immense Star Power to Vishnu Manchu's Devotional Tale

టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనిలో భాగంగా మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు మరియు ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రం కోసం కలుసుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియాలో దీనిపై స్పందిస్తూ ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అందులో.. “న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ‘కన్నప్ప’ సినిమా కోసం ఇద్దరు సూపర్‌స్టార్స్, ‘పెదరాయుడు’ లెజెండ్స్ మోహన్ బాబు సర్ మరియు శరత్ కుమార్ సర్ కలిశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారతీయ సినిమా మహోత్సవానికి తమ అపారమైన స్టార్ పవర్‌ని జోడిస్తున్నారు. భక్తి మరియు వైభవం యొక్క పురాణ కథ కోసం సిద్ధంగా ఉండండి” అని పేర్కొన్నారు. కాగా వీరిద్దరూ 1990లలో ఒకే కథతో రూపొందిన చిత్రాలలో నటించడం విశేషం. ‘నాట్టమై’ అనే తమిళ సినిమాలో శరత్ కుమార్ ప్రధానపాత్రలో నటించగా.. దానిని తెలుగులో మోహన్ బాబు ‘పెదరాయుడు’ పేరుతో తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు.

ఇక ‘కన్నప్ప’ చిత్రాన్ని ‘అవా ఎంటర్టైన్మెంట్‌’ మరియు ’24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ’ పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మించనున్నారు. స్టార్‌ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్‌ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులు స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.