మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో చిరు ఎప్పుడూ ముదుంటారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోసారి తన ఉదారతను చూపించారు చిరు. తాజాగా తన చిన్న నాటి స్నేహితుడికి అండగా నిలిచారు చిరు. చిరంజీవి చిన్న నాటి స్నేహితుడైన పువ్వాడ రాజ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి తన స్నేహితుడికి చికిత్సా ఏర్పాట్లు చేశారట. అంతేకాదు అపోలో ఆస్పత్రికి వచ్చిన స్నేహితుడి దంపతులను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కలిశారట. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు చిరు చేసిన పనికి ప్రశంసలు కరిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను అప్పుడే మొదలుపెట్టాడు. ఈసారి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























