గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌

Mahesh Babu's Guntur Kaaram First Single to be Out Very Soon

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ విజయం సాధించగా.. ‘ఖలేజా” అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ‘గుంటూరు కారం’ మూడో సినిమాగా వస్తోంది. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం, అలాగే మహేశ్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ‘గుంటూరు కారం’పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దీంతో మూవీకి సంబంధించిన అప్‍డేట్స్ కోసం వారు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో విజయదశమి సందర్భంగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‍డేట్ ఇచ్చారు. ‘గుంటూరు కారం’ ఫస్ట్‌ సింగిల్‌ను అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చిత్రబృందం దీనికి సంబంధించి ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. అయితే అందులో స్పష్టమైన డేట్ ఏదీ చెప్పనప్పటికీ మరికొన్ని రోజుల్లోనే ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్ చేయనున్నట్లు అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. కాగా సంక్రాంతి పండగ సీజన్‌కు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉంటాయని, అలాగే ఈ చిత్రంలో మహేశ్‌ బాబు క్యారెక్టర్‌ విభిన్నంగా ఉంటుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతానికి రెండు సాంగ్స్‌ రెడీ అయ్యాయని, అక్టోబర్ 20 నాటికి షూటింగ్ పార్ట్ పూర్తవ్వొచ్చని కూడా ఆయన తెలిపారు.

ఇక ‘గుంటూరు కారం’ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే యేడాది జనవరి 12న పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న పాన్-వరల్డ్ మూవీలో నటించనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణ కథాంశంగా ఈ సినిమా ఉండనుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.