సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమా మొత్తం గరుడపురాణం బ్యాక్ డ్రాప్ గా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గరుడపురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి పలు రూమర్లు తెరపైకి వచ్చాయి. ఈమధ్య వచ్చిన విరూపాక్ష సినిమా ను ఈసినిమాతో పోల్చుతుండటంతో డైరెక్టర్ వీఐ ఆనంద్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా గురించి క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత ఈసినిమాకు, విరూపాక్షకు ఎలాంటి పోలికలు లేవు.. జోనర్ ఒకటి అయినంత మాత్రాన కథ ఒకటే అవ్వదు.. విఎఫ్ఎక్స్ విషయంలో మేము కాంప్రమైజ్ కావాలని అనుకోవడం లేదు..రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నామని తెలిపాడు.
మరోవైపు వీఐ ఆనంద్ ట్వీట్ ను నిర్మాత అనిల్ సుంకర ట్యాగ్ చేస్తూ మేము గతంలో కాస్ట్లీ మిస్టేక్స్ చేశాం.. కానీ ఈసారి అలా చేయాలనుకోవడం లేదు.. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయిన వెంటనే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం.. ఈసినిమా అంచనాలను అందుకుంటుందన్న నమ్మకం అయితే ఉందని తన ట్విట్టర్ లో తెలిపాడు.
We made some costly mistakes and trying not to repeat any more. Quality of VFX is always proportional to the time we can give. And for a movie like #OoruPeruBhairavakona , we want to announce the date as soon as VFX is complete. We are confident that the movie will reach the high… https://t.co/6f3Ui32u5T
— Anil Sunkara (@AnilSunkara1) October 15, 2023
కాగా సూపర్ న్యాచురల్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























