బాలీవుడ్ బాద్ షా షారుఖ్ మాత్రం నిజంగానే తాను బాద్ షా అని మరోసారి నిరూపించాడు. బాలీవుడు బాక్సాఫీస్ వరుస ఫ్లాప్స్ తో కుప్పకూలిపోతున్న తరుణంలో పఠాన్ సినిమాతో వచ్చిన ప్రాణం పోశాడు. ఈసినిమా అప్పుడు 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ తో తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్స్ జోరు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. సినిమా రిలీజ్ అయి ఇప్పటికే చాలా రోజులు అవుతున్నా ఇంకా కలెక్షన్స్ ను రాబట్టుకుంటూనే ఉంది. మొదటి నాలుగు రోజుల్లో 400 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా.. 10 రోజుల్లో దాదాపు 800 కోట్లు మూడు వారాలు పూర్తి అయ్యేపాటికి 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. తాజాగా చిత్రయూనిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకూ 1125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని 1200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకునే దిశగా వెళుతుంది. దీంతో హయ్యస్ట్ గ్రాస్ ను అందుకున్న తొలి సినిమాగా కూడా ఈసినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.
View this post on Instagram
కాగా షారుఖ్ నుండి త్వరలో రాబోతున్న సినిమా ఢంకీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. తాప్సీ, దియా మీర్జా, బొమ్మన్ ఇరానీ, విక్కీ కౌశల్, ధర్మేంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























