SSMB29 పై అనిల్ క్లారిటీ

anil ravipudi gives clarity about mahesh 29th movie

ఇప్పటి వరకూ కామెడీ ఎంటర్ టైనర్ లతో అలరించిన అనిల్ రావిపూడి కాస్త రూట్ మార్చి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లోకి వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే అనిల్ రావిపూడి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి మహేష్ తో సినిమా గురించి.. మహేష్ కొత్త సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో ఫ్యాన్స్ అయితే ఒప్పుకున్నారు.. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాకు, రాజమౌళి సినిమాకు మధ్య గ్యాప్ లో మహేష్ తో సినిమా ఉంటుందన్న కామెంట్స్ వస్తున్నాయి అని అడగగా దానికి అనిల్ రావిపూడి స్పందిస్తూ.. నేను షాకయ్యాను కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. సరిలేరు నీకెవ్వవరూ సినిమా ద్వారా లైఫ్ లో ఒక మంచి మనిషితో పరిచయం ఏర్పడింది.. నాతో చాలా హార్ట్ ఫుల్ గా మాట్లాడతారు..నేను ఏ సినిమా చేసినా నాకు సలహాలు ఇస్తుంటారు.. తప్పులు ఉంటే సరిదిద్దుతారు.. ఇలా చేయండి అలా చేయండి అని చెబుతుంటారు. ఆయనతో సినిమా అంటే నేను ఎప్పుడూ వెల్ కమే.. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఆయన ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం చాలా చాలా ప్రిపేర్ అవుతున్నారు. నిజంగా మహేష్ గారికి గ్యాప్ ఉండి సినిమా చేయమంటే చేస్తాను.. మేమిద్దరం కలిసి ఒక మంచి సినిమా తీశాం.. ఫ్యూచర్ లో కూడా ఛాన్స్ వస్తే మరో సినిమా చేస్తాం అంటూ తెలిపాడు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + sixteen =