సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమ్మాయి అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. నింగి నేలా.. నీలా నాలా కలిశాయే.. ఏకాంతం తప్పా నీకు నాకు ఏదీ తోడు రాదే అంటూ వచ్చే ఈపాట అయితే చాట్ బస్టర్ లా నిలవడం ఖాయం అనిపిస్తుంది. సాంగ్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. సందీప్ వంగ మార్క్ కనిపిస్తుంది. ఫస్ట్ పాటతోనే మంచి బజ్ క్రియేట్ చేశారు.
Presenting 1st song from Animal 🫶🏼 #HuaMain #Ammayi #Neevaadi #OhBaale #Pennaalehttps://t.co/5ax0PKFO2d@AnimalTheFilm @iamRashmika @jam8studio @raghavcofficial @KapilKapilan @IananthaSriram @manojmuntashir @Lyricist_Mohan @Aazad_Varadaraj #Mankombugopalakrishnan @thedeol #RK
— Bhadrakali Pictures (@VangaPictures) October 11, 2023
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































