ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ లోకి కొత్తవాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో సందడిగా మారింది. పాతవాళ్లు కొత్త వాళ్ల దగ్గరనుండి బయట ఎలా ఉంది ఏం జరుగుతుంది అనే విషయాలను రాబట్టాలని ప్రయత్నిస్తుంటే మరోపక్క కొత్తవాళ్లు ఐదు వారాలు చూసి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి కాస్త ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ ప్రారంభంతోనే ఇంటి సభ్యులను రెండు కేటగిరీల్లో డివైడ్ చేస్తూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పటికే హౌస్ లో ఉన్నవాళ్లు ఆటగాళ్లు అని.. కొత్తగా వచ్చినవాళ్లు పోటుగాళ్లు అని చెప్పాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మండే అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది నామినేషన్స్ ప్రక్రియ. ఈ ప్రిక్రియలో పోటుగాళ్ల లో ఉన్న సభ్యులు వచ్చి ఒక్కోక్కరు ఆటగాళ్లలో ఇద్దరిని నామినేట్ చేయాలి. దీనిలో భాగంగా మొదటగా వచ్చిన నయని పావని తేజను అలానే అమర్ దీప్ ను నామినేట్ చేసింది. తేజను టాస్కుల్లో ఎఫర్ట్ సరిగ్గా పెట్టడంలేదని చెప్పింది.. అమర్ ను చేస్తూ గేమ్ లో స్పోర్టివ్ నెస్ లేదు.. హెయిర్ కట్ విషయంలో కూడా నాకు నచ్చలేదు అని చెప్పుకొచ్చింది. తరువాత భోళే వచ్చి అమర్ దీప్ ను నామినేట్ చేస్తూ.. రైతు బిడ్డ ప్రశాంత్ ను మొదట్లో చాలా నిందించాయి.. టార్గెట్ చేశావు.. ఆయన బాధపడే మాటలు మాట్లాడావు.. అంటూ తెలిపాడు. సందీప్ ను నామినేట్ చేస్తూ.. గౌతమ్ ను తేజ కొట్టేప్పుడు సంచాలకుడిగా ఉన్నప్పుడు ఆపలేదు అని రీజన్ చెబుతాడు.
అనంతరం అశ్విని వచ్చి అమర్ దీప్ ను శోభా శెట్టిని నామినేట్ చేసింది. సెల్పిష్ గా ఆడారంటూ ఆమర్ దీప్ ను.. గ్రూపిజంతో ఆడుతున్నావు.. ప్రియాంకను మానిప్యులేట్ చేస్తున్నావు అంటూ రీజన్స్ చెబుతుంది. పూజా మూర్తి వచ్చి గౌతమ్ ను కొట్టే విషయంలో తేజను అలానే ఫుడ్ విషయంలో అగ్రెసివ్ అయ్యారంటూ యావర్ ను నామినేట్ చేసింది. అర్జున్ అమర్ దీప్ ను అలానే సందీప్ ను నామినేట్ చేశాడు.
పోటుగాళ్లు నామినేషన్ ప్రక్రియ అయిన వెంటనే ఆటగాళ్లకు ఒక ఛాన్స్ ఇస్తూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఆటగాళ్లు.. పోటుగాళ్లలో ఒకడిని, ఆటగాళ్లలో ఒకడిని నామినేట్ చేయాలని చెబుతాడు. ఈనేపథ్యంలో అమర్ దీప్- అశ్విని, యావర్ ను.. శోభాశెట్టి-అమర్ దీప్, అశ్వినిని..శివాజీ- అమర్ దీప్, పూజామూర్తిని.. తేజ-సందీప్, నయని పావనిని.. ప్రియాంక-తేజ, అశ్వినిని..సందీప్-తేజ, అర్జున్ ను.. యావర్- శోభాశెట్టి,పూజామూర్తి.. ప్రశాంత్-నయని పావని, అమర్ దీప్ ను నామినేట్ చేస్తాడు. నామినేషన్ ప్రక్రియ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తవుతుంది.
మరి ఫైనల్ గా నామినేషన్స్ లోకి ఎవరు వచ్చారు.. బిగ్ బాస్ లాస్ట్ మినిట్ లో మరేదైనా ట్విస్ట్ ఇస్తాడా?లేదా? అన్న విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























