ప్రస్తుతం రిలీజ్ కు ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకోసం ఇండియన్ వైడ్ గా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్ అంటే ప్రత్యేకంగా ప్రమోషన్స్ అక్కర్లేదు.. వీరి కాంబినేషన్స్ కే కావాల్సిన బజ్ వచ్చేస్తుంది. అయితే రిలీజ్ వరకూ ఆ బజ్ ఉండాలి కాబట్టి ప్రమోషన్స్ చేయాలి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సలార్ రిలీజ్ డేట్ రోజే షారుఖ్ నటించిన డంకీ సినిమా కూడా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ పై మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. నిజానికి నేను రెండు సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా.. అయితే రెండు సినిమాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం నా ఓటు సలార్ కే అంటూ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Really excited for both but if I had to pick one I would say #Salaar ☺️ loved the teaser & thought Prabhas sir & Prithviraj sir looked too cool in it! 🔥 https://t.co/SxOIjbgop6
— Malavika Mohanan (@MalavikaM_) October 3, 2023
కాగా సలార్ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























