షారుక్ ఖాన్ జవాన్ ఈవారంలో1000కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అంతేకాదు విడుదలైన నెలలోపే ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డులోకెక్కనుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో షారుక్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా షారుక్ స్టైల్,స్వాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.దానికితోడు మేజర్ సినిమాలు ఏవి విడుదలకాకపోవడం కూడా కలిసొచ్చింది.కేవలం నార్త్ లోనే కాదు జవాన్ సౌత్ లోకుడా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.తెలుగు,తమిళంలో కలిపి ఫుల్ రన్ లో100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఓ బాలీవుడ్ మూవీ ఈరేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే జవాన్,నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.బాలీవుడ్ లో మినిమం 8వారాల గ్యాప్ తరువాతే ఓటిటి లో రిలీజ్ చేసుకోవాలనే రూల్ ఉండడంతో ఇప్పుడప్పుడే ఓటిటి లోకి రాదు.అయితే సప్రైజ్ ఏంటంటే సినిమాలో రన్ టైం కోసం డిలేట్ చేసిన సీన్లను ఓటిటి వెర్షన్ లో ఆడ్ చేయనున్నారట దాంతో రన్ టైం 3గంటలు దాటనుంది.జవాన్ సుమారు 3గంటల 15నిమిషాలతో ఓటిటి లోకి రిలీజ్ కానుందని టాక్.డైరెక్టర్ అట్లీ కూడా రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో ఓటిటి వెర్షన్ సప్రైసింగ్ గా ఉంటుందని అన్నాడు.మరి అంత రన్ టైంతో వస్తే ఈ సినిమాను ఓటిటి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























