ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా లియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా ఇది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా ఆక్టోబర్ 19 వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్, నా రెడీ అనే పాటను కూడా రిలీజ్ చేయగా.. అన్నీ సినిమాపై మంచి హైప్ నే క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు మేకర్స్. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోసారి వరుస అప్ డేట్స్ ఇస్తూ హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే వినాయక చవితికి తెలుగు, కన్నడ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇకనుండి రిలీజ్ వరకూ ఏదో ఒక పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. తమిళ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
KEEP CALM AND PREPARE FOR BATTLE
மிளக தட்டி முட்டி.. என்ன குக் பண்றீங்க ப்ரோ என்று கேட்ட அனைவருக்கும் அக்டோபர் 19 அன்று விருந்து #LeoPosterFeast #LeoTamilPoster#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial… pic.twitter.com/6rHSifDzxm
— Seven Screen Studio (@7screenstudio) September 20, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























