నవీన్ పోలిశెట్టి ,అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.గత వారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని సూపర్ హిట్ అనిపించుకుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక యూఎస్ఏ లో ఈసినిమా బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఇప్పటివరకు అక్కడ 1.4మిలియన్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 2మిలియన్ క్లబ్ లో చేరడం కష్టమేమి కాకపోవచ్చు.ఇదిలావుంటే తెలుగు తోపాటు తమిళంలో విడుదలైన ఈసినిమా ఇప్పుడు మళయాళంలోకూడా రిలీజ్ అవుతుంది.రేపు ఈసినిమా అక్కడ రిలీజ్ కానుంది.మరి మళయాళంలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాకి రధన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది.యూవీ క్రియేషన్స్ లో అనుష్కకు ఇది మూడో సినిమాకాగా అన్ని సూపర్ హిట్ అనిపించుకున్నాయి.ఇంతకుముందు యూవీలో అనుష్క..మిర్చి, భాగమతి సినిమాలు చేసింది. ఇక నవీన్ పొలిశెట్టి ,మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో హ్యాట్రిక్ కొట్టాడు.ఇంతకుముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ,జాతిరత్నాలు సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























